English | Telugu
అతిలోక సుందరితో పోలిక... ఎమోషనల్ అయిన జాన్వీ!
Updated : Aug 8, 2023
జాన్వీకపూర్ ఇప్పుడు ఇండియాలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యంగ్ యాక్ట్రెస్. 2018లో ధడక్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ కపూర్. ఇషాన్ కట్టర్ హీరోగా నటించిన ఆ సినిమాకు శశాంక్ ఖైతాన్ తెరకెక్కించారు. తొలి సినిమాలోనే ఆమె యాక్టింగ్ బ్రిలియన్స్ కి, సింప్లిసిటీకి ఫుల్ మార్కులు పడ్డాయి. అతిలోక సుందరి కూతురంటే ఆ మాత్రం ఉంటుందని అందరూ మెచ్చుకున్నారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రీసెంట్‌గా బవాల్ మూవీ చేశారు జాన్వీ కపూర్. నితీష్ తివారి తెరకెక్కించిన సినిమా అది. ఈ చిత్రంలో పెళ్లయిన యువతిగా కనిపించారు జాన్వీకపూర్. ఆమె నటనకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బవాల్‌లో నిషాగా ఆమె నటనను, ఇంగ్లిష్ వింగ్లిష్‌లో శశి కేరక్టర్‌లో కనిపించిన శ్రీదేవి నటనతో పోలుస్తున్నారు. ఆ మెసేజ్‌లు చదివి ఎమోషనల్ అయ్యారు జాన్వీ కపూర్.
నిషాను శశి మరింత ప్రేమించేదేమో అనే మాటలతో వీడియో వైరల్ అవుతోంది. నిషా, శశి కేరక్టర్లు నవ్వడం, నడవడం, ఏడవడం, కిటికీల నుంచి చూడటం... అంతా ఒకేలా ఉందంటూ సీన్స్ ని కంపేర్ చేశారు. తన ప్రతి కదలికను తల్లితో కంపేర్ చేయడం గమనించి, భావోద్వేగానికి లోనయ్యారు జాన్వీ కపూర్. ఆ వీడియో చూసి తాను ఏడ్చినట్టు చెప్పారు జాన్వీ కపూర్. తనని ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న అభిమానులకు రుణపడి ఉంటానని తెలిపారు. తన తల్లి గర్వపడేలా సినిమాలు చేస్తానని అన్నారు. 2018లో కన్నుమూశారు అతిలోక సుందరి. తన జీవితంలో తన తల్లి మరణాన్ని జీర్ణించుకున్న రోజులను యుద్ధంగా ప్రకటించారు జాన్వీకపూర్. తల్లి లేకపోవడం, దఢక్ షూటింగ్‌లో పాల్గొనాల్సి రావడంతో తనతో తాను పెద్ద యుద్ధమే చేశానని అన్నారు. జాన్వీ కపూర్ నటించిన బవాల్ సినిమా ఈ నెల 21న డిజిటల్‌లో విడుదలైంది. శ్రీదేవి నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్ 2012లో అక్టోబర్ 5న విడుదలైంది.