Read more!

English | Telugu

విద్యా బాల‌న్.. ముచ్చ‌ట‌గా మూడోసారి అమెజాన్ లో!

`ద డ‌ర్టీ పిక్చ‌ర్` (2011), `క‌హానీ` (2012) వంటి విజ‌య‌వంత‌మైన సినిమాల‌తో హిందీనాట నాయికా ప్రాధాన్య చిత్రాల‌కు చిరునామాగా నిలిచారు వెర్స‌టైల్ యాక్ట్ర‌స్ విద్యా బాల‌న్. పెళ్ళ‌య్యాక కూడా న‌టిగా విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్న విద్య‌.. ఇప్ప‌టికీ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, క‌రోనా లాక్ డౌన్ నుంచి విద్యా బాల‌న్ న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఓటీటీ బాట ప‌డుతూనే ఉన్నాయి. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనే ఆయా చిత్రాలు స్ట్రీమ్ అవుతున్నాయి. 2020 జూలై 31న విద్య టైటిల్ రోల్ లో న‌టించిన బ‌యోగ్రాఫిక‌ల్ డ్రామా `శ‌కుంతలా దేవి` స్ట్రీమ్ కాగా.. 2021 జూన్ 18న థ్రిల్ల‌ర్ మూవీ `షేర్ని` కూడా సేమ్ ఓటీటీ వేదిక‌లో స్ట్రీమ్ అయింది. క‌ట్ చేస్తే.. ఈ ఏడాది మార్చి 18న విద్య న‌టించిన తాజా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ `జ‌ల్సా` కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమ్ కాబోతోంది. మ‌రి.. గత రెండు సంద‌ర్భాల్లోనూ త‌న‌దైన అభిన‌యంతో మురిపించిన విద్య‌.. కొత్త చిత్రంతోనూ ముచ్చ‌ట‌గా మూడోసారి అమెజాన్ లో మెస్మ‌రైజ్ చేస్తుందేమో చూడాలి.

సురేశ్ త్రివేణి డైరెక్ట్ చేసిన `జ‌ల్సా`లో విద్య‌తో పాటు షెఫాలి షా, రోహిణి హ‌ట్టంగ‌డి, సూర్య కాశిభ‌ట్ల  ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.