Read more!

English | Telugu

హాట్ టాపిక్ గా బీచ్ లో హృతిక్, దీపిక రొమాన్స్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఫైటర్'. 'వార్', 'పఠాన్' సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రిలీజ్ కు నెలరోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ 'ఇష్క్ జైసా కుచ్' పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ లో హృతిక్, దీపిక ఫుల్ రొమాటింక్ మోడ్‌లో ఉండ‌గా.. వారిద్ద‌రీ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఉంది. ముఖ్యంగా దీపిక తన అందాల విందుతో కుర్రాళ్ళ మతి పోగొట్టేలా ఉంది. సాంగ్ లో హృతిక్ డ్యాన్స్ స్టెప్పులు, దీపిక గ్లామర్ డోస్ అదిరిపోయాయి.

సాధారణంగా హృతిక్‌ కి అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే దీపికకు పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో మనకు తెలిసిందే. ఆమె అందాన్ని ఓ స్థాయిలో ఆరాధిస్తారు. అలాంటి ఇద్దరు కలిసి ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా దీపిక కనిపించనుంది. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ సందడి చేయనున్నాడు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.