Read more!

English | Telugu

ర‌ణ్‌వీర్ సింగ్ సినిమా గురించి హింట్ ఇచ్చిన శోభిత‌!

ఫ‌ర్హాన్ అక్త‌ర్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ర‌ణ్‌వీర్ సింగ్ సినిమా గురించి ఎక్స్  పెక్టేష‌న్స్ మామూలుగా లేవు. డాన్‌3 అంటే మాట‌లు కాదుగ‌దా మ‌రి. ఆ రేంజ్ సినిమాకు ఎక్స్ పెక్టేష‌న్స్ కూడా అదే రేంజ్‌లోనే ఉంటాయి క‌దా. డాన్ 3 హీరో, డైర‌క్ట‌ర్ సంగ‌తి స‌రే, ఇంత‌కీ హీరోయిన్ ఎవ‌ర‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తున్న విష‌యం. ఆ ఆసక్తి కేవ‌లం అభిమానుల్లోనే అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. సెల‌బ్రిటీల్లోనూ డాన్‌3 హీరోయిన్ కేర‌క్ట‌ర్ మీద ఆస‌క్తి మెండుగా ఉంది. ఆల్రెడీ డాన్‌3 నాయిక‌గా కృతిస‌న‌న్ పేరు చాలా సార్లు వినిపించింది. కియారా అద్వానీ కూడా న‌టిస్తున్నార‌నే మాట‌లు వ‌చ్చాయి. అయితే డాన్ ఫ్రాంఛైజీలో న‌టించ‌డానికి సుముఖ‌త తెలుపుతున్నారు న‌టి శోభిత ధూళిపాళ‌. 

డాన్‌3 లో హీరోయిన్ గురించి శోభిత మాట్లాడుతూ ``డాన్‌3 లో అవ‌కాశం వ‌స్తే చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. మేడ్ ఇన్ హెవెన్ సినిమా చూసిన చాలా మంది తారా (అందులో శోభిత చేసిన పాత్ర పేరు) ఎన‌ర్జీని చూసి వావ్ అంటున్నారు. అంతే కాదు డాన్ సీరీస్ లో రోమా కేర‌క్ట‌ర్‌కి కావాల్సిన అన్ని అంశాలు తారాలో ఉన్నాయ‌ని భావిస్తున్నారు. అందుకే డాన్‌3లో రోమాగా న‌టించ‌డానికి నేనెప్పుడూ రెడీగానే ఉన్నాను. పైగా అది నాకు క‌ల‌లాంటిది. కాబ‌ట్టి ఇప్పుడు ఎవ‌రైనా న‌న్ను రోమాతో కంపేర్ చేస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ప్రియాంక అప్ప‌ట్లో రోమా కేర‌క్ట‌ర్‌లో అద్భుతంగా క‌నిపించింది. డాన్‌3 కి ఆడిష‌న్ ఇవ్వ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను`` అని అన్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ ఇప్పుడు డాన్‌3లో హీరో. గ‌తంలో షారుఖ్ చేసిన కేర‌క్ట‌ర్ అది. 1978 డాన్ సినిమాకు రీమేక్‌గా ఫ‌ర్హాన్ చేసిన మూవీ అది.
ఎ న్యూ ఎరా బిగిన్స్ అంటూ డాన్ 3 గురించి ఫ‌ర్హాన్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎక్స్ పెక్టేష‌న్స్ పీక్స్ లో ఉన్నాయి.