English | Telugu
‘హృదయం’ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్!
Updated : Jul 14, 2023
ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్ కలిసి నటించిన హృదయం సినిమా చూశారా? వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఆ సినిమా మీకు ఫేవరేట్ సినిమానా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో మరో సినిమా సిద్ధమవుతోంది. నిర్మాత విశాఖ్ సుబ్రమణియం ఈ సినిమా గురించి ప్రకటించారు. ఆయన నిర్మాణ సంస్థ మేరీల్యాండ్ సినిమాస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. సూపర్ హిట్ హృదయం చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలోనే మొదలు కానున్న సినిమాలో నివిన్ పాలీ నటిస్తున్నారు. వినీత్‌కి నివీన్ అత్యంత సన్నిహితుడు. అతనితో పాటు ధ్యాన్ శ్రీనివాసన్, బేసిల్ జోసెఫ్, అజు వర్ఘీస్, నీరజ్ మాధవ్, నీతా పిళ్లై, షాన్ రెహ్మాన్, నిఖిల్ న్యాయర్ అర్జున్ లాల్, వినీత్ కీ రోల్స్ చేస్తున్నారు.
వినీత్ తండ్రి శ్రీనివాసన్ నిజ జీవితంలోనూ, ప్రణవ్ తండ్రి మోహన్‌లాల్ నిజ జీవితంలోనూ జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మద్రాసు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.వినీత్ గత చిత్రాల్లోనూ చాలా వరకు మద్రాసుతో ఏదో రకంగా కనెక్షన్ ఉంటుంది. చెన్నై అంటే ఆయనకు అంత ఇష్టం. హృదయాన్ని మించి హిట్ కావాలంటూ వినీత్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు నెటిజన్లు. హృదయం సినిమాలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయని, అంతకు మించిన ట్యూన్స్ రెడీ చేయమని హింట్ ఇస్తున్నారు. బ్రీజీ అట్మాస్పియర్, మెయిన్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా అనిపించిందని, ఈ సినిమాలోనూ అవన్నీ మిస్ కాకుండా చూసుకోమని సలహాలిస్తున్నారు అభిమానులు. అన్నీ నోట్ చేసుకుంటున్నానని సరదాగా అంటున్నారు వినీత్.