English | Telugu

పాత క‌థ‌ల మీద బాలీవుడ్ ఫోక‌స్‌

ఆగ‌డం గొప్పా? సాగ‌డం గొప్పా? ఎప్ప‌టిక‌య్య‌ది ప్ర‌స్తుతం ఆ క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని స‌క్సెస్ కొట్ట‌డ‌మే సినీ నీతి సుమ‌తి అని అంటోంది బాలీవుడ్‌. ఇప్పుడు సాగుతున్న కాలం కాబ‌ట్టి, గ‌తంలో హిట్ అయిన సినిమాల‌ను కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌తో ఉంది. త్రీ ఇడియ‌ట్స్, మ‌ర్దాని 3, డాన్ 3 సినిమాల‌ను తెర‌కెక్కించాల‌న్న‌ది మేక‌ర్స్ సంక‌ల్పం. యాక్ష‌న్ ఫ్రాంఛైజీలు, కామెడీ ఫ్రాంఛైజీలు, హార‌ర్ కామెడీలు రాజ్య‌మేలుతున్న కాలం ఇది. అందుకే ర‌క‌ర‌కాల సినిమాల‌కు సీక్వెల్స్ ప్ర‌క‌టిస్తున్నారు. వాటిల్లో ఇప్ప‌టికీ అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌క‌పోయినా, ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకుంటున్న సినిమాల పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిలో త్రీ ఇడియ‌ట్స్, మ‌ర్దాని 3, డాన్ 3 మెయిన్‌గా చెప్పుకోవాల్సిన సినిమాలు.

3 ఇడియ‌ట్స్ సీక్వెల్‌

త్రీ ఇడియట్స్ గురించి మొన్న‌మొన్న‌టిదాకా ఎవ‌రూ నోరు విప్ప‌లేదు. కానీ ఆ సినిమా హీరోలు ముగ్గురూ క‌లిసి ఒకేచోట క‌నిపించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో సీక్వెల్ ఏమైనా ప్లానింగ్ లో ఉందా? అని అనుకున్నారు. రీసెంట్‌గా దీసి గురించే క‌రీనాక‌పూర్ కూడా మెల్లిగా హింట్ ఇచ్చారు. త్రీ ఇడియ‌ట్స్ కి సీక్వెల్ గురించి మేక‌ర్స్ లో ఆలోచ‌న లేక‌పోతే, ఇలాంటి విష‌యాల ప్ర‌స్తావ‌నే ఉండ‌దు క‌దా అని అంటున్నారు నెటిజ‌న్లు. త్వ‌ర‌లో అనౌన్స్ మెంట్ వ‌చ్చేస్తే బావుంటుంద‌ని భావిస్తున్నారు.

మ‌ర్దాని 3

రాణిముఖ‌ర్జీ కాప్ అవ‌తార్‌లో క‌నిపించిన కాన్సెప్ట్ మ‌ర్దాని. ఇప్ప‌టికే ఫ‌స్ట్, సెకండ్ పార్టుల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. పెద్ద హిట్ అయింది. ఆ హిట్‌ని కంటిన్యూ చేసేలా క‌థ సిద్ధ‌మైతే, చేయ‌డానికి తానెప్పుడూ రెడీగానే ఉన్నాన‌ని చెబుతున్నారు రాణీముఖ‌ర్జీ. అలా మ‌ర్దానీ త్రీక్వెల్ ప్రాసెస్‌లో ఉంది.

డాన్ 3

షారుఖ్ ఇప్పుడు జోరుమీదున్నారు. ఆయ‌న న‌టించిన సినిమా డాన్‌కి త్రీక్వెల్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జ‌వాన్‌, డంకీ సినిమాల త‌ర్వాత షారుఖ్ డాన్ 3లో న‌టిస్తార‌న్న‌ది నెట్టంట్లో వైర‌ల్ అవుతున్న విష‌యం. బాలీవుడ్ ఓ మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ మూవీస్‌లో ఈ కాన్సెప్టులున్నాయి. మ‌రి మేక‌ర్స్ వీటి గురించి అఫిషియ‌ల్‌గా ఎప్పుడు మాట్లాడుతారో వేచి చూడాలి.