Read more!

English | Telugu

సినిమాలతోపాటు కొత్త వ్యాపారం మొదలెట్టిన సన్నీ లియోన్‌!

సన్ని లియోన్‌ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడైతే సన్ని వంటి సెలబ్రిటీకి ఇంత ఫాలోయింగ్‌ ఉండేది కాదేమో. ఇంటర్నెట్‌ ప్రపంచమంతా విస్తరించడంతో ప్రస్తుతం ఆమె గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. శృంగార తారగా ఎంతో పాపులర్‌ అయిన సన్ని ఇప్పుడు ఆ తరహా చిత్రాలకు గుడ్‌బై చెప్పి ఇండియాలో సెటిలైంది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన సన్ని ఇప్పుడు సినిమాలతో పాటు బిజినెస్‌పై కూడా దృష్టి పెట్టింది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సన్ని ఇప్పుడు కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చెయ్యబోతున్నట్టు స్వయంగా వెల్లడిరచింది. 

సాధారణంగా సినిమా తారలు సినిమాల్లో నటిస్తూనే బిజినెస్‌లో కూడా రాణిస్తుంటారు. సన్నికి కూడా సొంత బిజినెస్‌లు ఉన్నాయి. పలు వ్యాపారాల్లో డబ్బును ఇన్‌వెస్ట్‌ చేసింది. తాజాగా హోటల్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. తను స్టార్ట్‌ చేస్తున్న కొత్త రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి ఢల్లీిలోని నోయిడాలో రెస్టారెంట్‌ స్టార్ట్‌ చేయబోతోంది. ఇప్పటివరకు తన అందాలతో కనువిందు చేసిన సన్ని ఇక తన రెస్టారెంట్‌కి వచ్చేవారికి విందు భోజనం వడ్డిస్తుందట. ఆమె పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆమెకు బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.