Read more!

English | Telugu

మహిళా ప్రాధాన్యత సినిమా అనే మాట అబద్ధం..వాళ్ళకి ధన్యవాదాలు 

భాషతో సంబంధం లేకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చాలానే వచ్చాయి. వాటిల్లో చాలా భాగం విజయం సాధించాయి. అపజయాల శాతం చాలా తక్కువే అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం అదంతా మీ అపోహ అని అంటుంది. పైగా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె నటించిన చాలా చిత్రాలు మహిళా ప్రాధాన్యతని తెలిపేవే. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా! టాయిలెట్ మూవీతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన   భూమి ఫెడ్నేకర్ (Bhumi Pednekar)ఆమె ఏమందో చూద్దాం..

మొదటి సినిమాకే బెస్ట్ ఫిమేల్ అవార్డు గెలుచుకున్న  భూమి ఫెడ్నేకర్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.చాలా మంది సినీ ప్రేమికులకి అభిమాన నటి కూడా. ఈమె తాజాగా ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో  కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. మహిళా ప్రాధాన్యమున్న సినిమా అనే టాగ్ లైన్ ఉన్నంత మాత్రాన ఒక సినిమా విజయం సాదించదు. కథ బాగుండి  సినిమాని ప్రేక్షకులకి నచ్చేలా మలిచినప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుంది. మహిళా ప్రాధాన్యమున్న చిత్రం అని మేకర్స్  ప్రకటించగానే  ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాపై ఉంటుందని అనుకోవడం కూడా  అపోహ.

పైగా  ఫిమేల్ లీడ్ ప్రాజెక్ట్ అని  అంటేనే చిరాకు వస్తుంది. అయినా ప్రేక్షకులు మంచి సినిమాని కోరుకుంటారు తప్ప హీరో రోల్ ఎంత హీరోయిన్ రోల్ ఎంత అని చూడరు.అసలు అదే కనుక నిజమైతే నేను ఇక్కడ దాకా వచ్చే దాన్ని కాదు. కాకపోతే దర్శకులు, రచయితలు  నా నటన నచ్చి బలమైన పాత్రల్ని సృష్టించడం నా అదృష్టం. ఇప్పుడు భూమి చెప్పిన ఈ మాటలన్నీ వైరల్ గా మారాయి.దమ్ లగాకై హైష.శుభ మంగళ్ సావధాన్, బాల, బదాయ్ ధో, రక్షా బంధన్, థాంక్యూ ఫర్ కింగ్ లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా షారుక్ వైఫ్ గౌరీ  నిర్మాతగా వచ్చిన బక్షక్ లోను నటించింది. మరిన్ని అప్ కమింగ్ మూవీస్ ఉన్నాయి.