Read more!

English | Telugu

అఫీషియల్.. హాలీవుడ్ లోకి 'ఆలియా భట్' గ్రాండ్ ఎంట్రీ

వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హవా చూపుతోంది. ఇటీవల 'గంగూబాయి కతియావాడి'తో ఆకట్టుకున్న ఆలియా త్వరలో 'ఆర్ఆర్ఆర్'తో ప్రేక్షకులను పలకరించనుంది. 'బ్రహ్మాస్త్ర', 'NTR30' తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ఆమె చేతిలో ఉన్నాయి. ఇక తాజాగా ఓ క్రేజీ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుంది ఆలియా.

నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే ఓ భారీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ తో ఆలియా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది.  గాల్ గాడట్, జమీ డోర్నన్ ప్రధాన తారలుగా తాము నిర్మిస్తున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలో వాళ్ళిద్దరితో పాటు ఆలియా భట్ కూడా నటిస్తున్నట్టు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. ఈ సినిమాకి టామ్ హార్పర్ దర్శకుడు. ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రక్కన రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సినిమాలతో సత్తా చాటుతోంది. ఆలియా భట్ కూడా అక్కడ వరుస ఆఫర్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి.