English | Telugu
తొందర పడినంత మాత్రాన జరగవు.. మచిలీపట్నం శ్రీకాంత్ కథే ఇది
Updated : May 25, 2024
2020 లో వచ్చిన జానే మన్, జానే మన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ లో సినీ అరంగ్రేటమ్ చేసిన నటి అలయా ఎఫ్(Alaya f) మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి నటి అనే పేరు తెచ్చుకుంది. లేటెస్ట్ గా శ్రీకాంత్ అనే బయో పిక్ లో నటించింది. రాజ్ కుమార్ రావు, జ్యోతిక వంటి నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ నెల పదిన రిలీజ్ అవ్వగా హిట్ టాక్ ని తెచ్చుకుంది. తాజాగా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అలయా చెప్పిన విషయాలు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా నిలిచాయి
ఒక నటిగా నేను చాలా ఎదిగానని అనిపిస్తుంది. దర్శకులే నన్ను అలా తీర్చిద్దిదారు. ఎప్పుడూ కూడా సవాళ్లు తో కూడిన పాత్రలు చెయ్యడానికే ఇష్టపడుతుంటాను. సెట్లో ఆ పాత్రల కోసం ఎంతైనా కష్టపడతా. అలాంటి పాత్రలే ఆర్టిస్ట్ కి ఉత్తేజాన్ని ఇస్తాయి. అలాగే నేను ఎక్కువగా బాధపడటం అంటు జరగదు. ఉదాహరణకి నా ఫస్ట్ మూవీ విడుదల అయిన కొన్ని రోజులకే కరోనా వల్ల లాక్ డౌన్ విధించారు. నేను మాత్రం ఆ విషయంలో బాధపడలేదు. కనీసం కొన్ని రోజులైనా నా ఫస్ట్ మూవీ థియేటర్ లో రన్ అయినందుకు హ్యాపీ గా ఫీలయ్యాను.అలాగే సినిమా రంగంలో రాణించాలంటే ఓపిక ఉండాలి. స్టార్ డం వెంటనే రావాలంటే రాదు. జీవితంలో జరగాల్సినవి టైం వచ్చినప్పుడే జరుగుతాయి. మనం తొందర పడినంత పడిన మాత్రాన కుదరదని చెప్పుకొచ్చింది. జీవితంలో మనం పెట్టుకున్న షరతుల్ని పాటిస్తేనే విజయం దక్కదు అనే సూత్రాన్ని కూడా చెప్పింది. ఫ్రెడ్డీ, యు టర్న్, బడేమియాన్ చోటేమియాన్, లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఇక శ్రీకాంత్ మూవీ మన తెలుగు వ్యక్తి అయిన శ్రీకాంత్ (srikanth)అనే ఎంటర్ ప్యూనర్ జీవిత కథ ఆధారంగానే తెరకెక్కింది. . శ్రీకాంత్ పుట్టుకతోనే గుడ్డివాడిగా జన్మించాడు.తన లోపాన్ని దిగమింగుకొని జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని అంచలంచలుగా అత్యునత స్థాయికి ఎదిగాడు. ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసిన ఆయన వికలాంగుల కోసం 2011లో సమన్వాయి సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్‌ను స్థాపించారు.ఇందులో బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ను ప్రారంభించాడు. ఆర్థికంగా స్వతంత్ర మరియు స్వీయ స్థిరమైన జీవితం కోసం బహుళ వైకల్యాలున్న విద్యార్థులకు విద్య, వృత్తి, ఆర్థిక మరియు పునరావాస సేవలను అందించాడు. 2012లో, బొల్లా సహ వ్యవస్థాపకుడు రవి మంతతో కలిసి బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించాడు .దీని ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తుంది మరియు రతన్ టాటా నుండి నిధులతో అనేక వందల మంది వికలాంగులకు ఉపాధిని అందిస్తుంది .శ్రీకాంత్ జన్మస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నం.