Read more!

English | Telugu

'అల వైకుంఠ‌పుర‌ములో' హిందీ వెర్ష‌న్ ఫ‌స్ట్ లుక్ ఇదే!

 

2020 సంక్రాంతికి విడుద‌లై అప్ప‌టికి అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' చిత్రం. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. బ‌న్నీ-పూజా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వండ‌ర్స్ క్రియేట్ చేసింది. వారిపై చిత్రీక‌రించిన పాట‌ల‌న్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా "బుట్ట‌బొమ్మ‌", "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌", "రాములో రాములా" పాట‌లు అంద‌రి పెదాల‌పై ఇప్ప‌టికీ నాట్యం చేస్తూనే ఉన్నాయి.

Also read: డిప్రెష‌న్‌తో 20 కిలోల బ‌రువు పెరిగిన సూప‌ర్‌స్టార్ కుమార్తె.. ఫొటోలు వైర‌ల్‌!

ఇటీవ‌ల 'పుష్ప' హిందీ వెర్ష‌న్ సాధించిన అమోఘ విజ‌యంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దాంతో బ‌న్నీ మునుప‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ 'అల వైకుంఠ‌పుర‌ములో' మూవీని హిందీలో డ‌బ్‌చేసి, థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ నిర్ణ‌యించింది. ఆ సంస్థ ఇప్ప‌టికే ప‌లు తెలుగు సినిమాల‌ను హిందీలో డ‌బ్‌చేసి, శాటిలైట్ చాన‌ల్స్‌లో, యూట్యూబ్‌లో రిలీజ్ చేసి, డ‌బ్బింగ్ సినిమాల ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా మంచి పేరు గ‌డించింది.

Also read: సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సమంత!

'అల వైకుంఠ‌పుర‌ములో' మూవీని అదే టైటిల్‌తో హిందీలో రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ నెల 26న విడుద‌ల చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. 'పుష్ప‌'గా హిందీ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిన బ‌న్నీ మ‌రి కొద్దిరోజుల్లో 'అల వైకుంఠ‌పుర‌ములో' మూవీతో వారిని ఎలా ఆక‌ట్టుకుంటాడో చూడాలి.