English | Telugu
ఇండస్ట్రీలో అంటరానివాడిగా చూశారంటున్న అగ్ర హీరో
Updated : Feb 29, 2024
డాన్సర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగిన నటుడు షాహిద్ కపూర్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసాయి. తాజాగా ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా నిలిచి హీట్ ని పెంచుతున్నాయి.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో షాహిద్ మాట్లాడుతు నేను సినిమా ఫీల్డ్ కి వచ్చిన కొత్తలో నన్ను అంటరాని వాడిగా చూసారని చెప్పడం కలకలం రేపుతోంది. అసలు ఇండస్ట్రీ వ్యక్తి కాకుండా బయట నుంచి ఎవరైనా ఫీల్డ్ లోకి వస్తే చాలా చులకనగా చూస్తారని చెప్పాడు. పైగా అనరాని మాటలు అంటారని అవన్నీ చాలా ఏళ్ళు అనుభవించానని కూడా చెప్పాడు. అలాగే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసాడు. ఫీల్డ్ లో గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్ లో తిరిగే వాళ్ళకే అవకాశాలు వస్తాయి.వేరే వాళ్ళని ఎదగకుండా చెయ్యడం వాళ్ళ పని అని కూడా చెప్పుకొచ్చాడు.
కానీ వచ్చిన కొత్తలో నేను వాళ్ళకి ఎదురుతిరగలేకపోయాను.కానీ ఇప్పుడు మాత్రం ఆలా చేస్తే ఎదురు తిరుగుతాను. టిట్ ఫర్ టాట్ ఇవ్వడమే అలాంటివాళ్ళకి సరైన శిక్ష అని చెప్పుకొచ్చాడు. అలాగే తన చిన్న తనంలో ఢిల్లీ నుంచి ముంబై కి వచ్చినపుడు స్కూల్ లో తన భాష ని కూడా అవమానించారని చెప్పాడు. చుప్ చుప్ కే, శిఖర్, జెర్సీ, జబ్ వుయ్ మెట్, తేరి మేరీ కహాని , రంగూన్ ,పద్మావత్, వెల్కమ్ టూ న్యూయార్క్, కబీర్ సింగ్, బ్లడీ డాడీ, లాంటి చిత్రాలు షాహిద్ కి మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం కొన్ని చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఆయన తల్లి తండ్రులిద్దరు ఇద్దరు కూడా నటులే. చాలా సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు.