English | Telugu

క‌రీనాతో ముద్దు సీన్‌... గుట్టువిప్పిన షాహిద్‌

క‌రీనా క‌పూర్‌ని షాహిద్ ముద్దుపెట్టుకున్న ఫొటోలు 2004లో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేశాయి. అప్ప‌ట్లో వైర‌ల్ అయిన ఆ ఫొటోలు చూసి ఏం చేయాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డ్డ విష‌యాన్ని ఒప్పుకున్నారు షాహిద్ క‌పూర్‌. అప్పుడు నాకు 24 ఏళ్లు. చిన్న పిల్లాడిని. ఏం చేయాలో నాకు పాలుపోలేదు అని ఓపెన్ అయ్యారు.

ఇప్పుడు మ‌నం సోష‌ల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏదైనా ఇలా షేర్ చేయ‌గానే అలా వైర‌ల్ అయిపోతుంది. కానీ, 2004లో ప‌రిస్థితి వేరు. విష‌యం ఏదైనా బ‌య‌ట‌కు పొక్కిందంటే సెల‌బ్రిటీల్లో ఒక ర‌క‌మైన టెన్ష‌న్ క‌నిపించేది. త‌న‌కు కూడా అలాంటి అనుభ‌వం ఉంద‌ని అంటున్నారు షాహిద్ క‌పూర్‌.

"ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ సెల్‌ఫోన్ ఉంది. కానీ అప్ప‌టి ప‌రిస్థితులు వేరు. అప్పుడు నాకు జ‌స్ట్ 24 ఏళ్లే. లేడీతో నేనున్న ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి నా ప్రైవ‌సీ మొత్తం పోయింద‌నుకున్నా. చాలా గంద‌ర‌గోళంగా అనిపించింది. ఆమెను అందులో నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డేయాలో అర్థం కాలేదు. నా ప‌రిస్థితి కూడా దిక్కుతోచ‌లేదు" అని అన్నారు.

ఆ త‌ర్వాత షాహిద్‌, క‌రీనా విడిపోయారు. ఇద్ద‌రికీ వేర్వేరు వ్య‌క్తుల‌తో పెళ్లిళ్ల‌యిపోయాయి. క‌రీనా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. షాహిద్ కూడా నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌ల డిజిట‌ల్ ఎంట్రీ కూడా ఇచ్చారు షాహిద్‌. ప్రేమ‌, కాంట్ర‌వ‌ర్శీల‌కు సంబంధించి ఇప్పుడు మేనేజ్ చేయ‌గ‌లిగిన ప‌రిప‌క్వ‌త అప్ప‌ట్లో లేద‌ని ఓపెన్‌గా ఒప్పుకుంటున్నారు షాహిద్‌.