English | Telugu
కాజోల్ కోసం డబ్బులు పెడుతున్న ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్!
Updated : Aug 19, 2023
ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కృతిసనన్ నిర్మాతగా మారారు. ఆమె డబ్బులు ఖర్చుపెట్టి సినిమా చేస్తున్నారు. కాజోల్, కృతిసనన్ కలిసి నటిస్తున్న సినిమా దో పట్టి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి రోహిత్ శెట్టి దిల్‌వాలేలో నటించారు. దో పట్టి మిస్టరీ థ్రిల్లర్ కథ.నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతోంది. కనికా ధిల్లాన్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. ``ఈ సినిమా కోసం కొంత ప్రిపేర్ అయ్యాం. కొన్నిసార్లు స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చాం. దో పట్టి రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం మొదలైంది.
థ్రిల్లింగ్ సస్పెన్స్ ఫిల్డ్ రైడ్‌గా ఉండబోతోంది. నార్త్ ఇండియాలోని హిల్స్ కి ఆడియన్స్ చేత ట్రావెల్ చేయించడానికి రెడీ అవుతోంది. అదే బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కిస్తున్నాం`` అని అంటున్నారు మేకర్స్. అడ్వంచర్, మిస్టరీ కలగలిసిన పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని అంటున్నారు యూనిట్ సభ్యులు. కృతి సనన్ నిర్మాతగా మారి, ప్రతి చిన్న ప్రాసెస్‌నీ ఎంజాయ్ చేస్తున్నారు. ``గేర్ మార్చి ఇంకా చాలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గట్‌ఫీలింగ్‌తోనే నిర్మాణంలోకి దిగాను`` అని అన్నారు మిమి యాక్టర్. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఆమె. దో పట్టి సినిమాను డైరక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.