English | Telugu
స్టార్ అయితే చాలనుకున్న అనన్య... జరిగిందేంటి?
Updated : Sep 12, 2023
బాలీవుడ్‌లో బడా హిట్ జవాన్ గురించిన మాటల్లో పడి, డీసెంట్ హిట్ డ్రీమ్ గర్ల్ 2 ని పట్టించుకోవట్లేదనే బాధ కనిపిస్తోంది పొడవు కాళ్ల సుందరి అనన్య పాండే మాటల్లో. ఆమె ఎన్నాల్లుగానో వెయిట్ చేస్తున్న హిట్ డ్రీమ్ గర్ల్ 2 తో వచ్చింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన లైగర్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో పేరు మారుమోగిపోతుందంతే అని ఫిక్సయిపోయారు అనన్య పాండే. అయితే అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సినిమాల్లో కనిపించినా, అవన్నీ ఫ్లాష్ అప్పియరెన్సులే. వాటి హిట్టూ ఫ్లాపులతో ఈ బ్యూటీకి సంబంధం లేదు. అందుకే అనన్య పాండే ఇప్పుడు డ్రీమ్ గర్ల్ 2 సక్సెస్‌ని బాగా మనసుకు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ 2 సినిమా చూసి థియేటర్లలో పడీ పడీ నవ్వుతున్నారని అంటున్నారు అనన్య పాండే.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన సినిమా డ్రీమ్ గర్ల్ 2. ఇందులో నాయికగా నటించారు అనన్య. ``స్కూల్లో చదువుతున్నప్పుడు, పెరిగి పెద్దవుతున్నప్పుడు నేను పెద్ద స్టార్ కావాలని కలలు కన్నాను. ఎప్పుడూ బాలీవుడ్ పాటలు పెట్టుకుని, డ్యాన్సులు చేసేదాన్ని. బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ అనన్య... అని స్టేజ్ మీద యాంకర్లు పిలుస్తుంటే వినాలనిపించేది. అవన్నీ జరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. నేనిప్పుడు బెటర్ పెర్ఫార్మర్ అవుతున్నాను. నాలో ఇంప్రూవ్‌మెంట్ నాకే తెలుస్తోంది. ప్రేక్షకులు కూడా అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను`` అని అన్నారు. రియల్ లైఫ్‌లో తన పార్ట్ నర్ అబద్ధాలు చెబితే అనన్య ఏం చేస్తారు? ఇదే ప్రశ్నను ఆమె ముందుంచితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ``ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకోరు. అసలు ఆ అవసరమే రాదు. అవతలివాళ్లకి ఉన్న సిట్చువేషన్‌ని అర్థం చేయించడానికే పాటుపడతారు. నేను కూడా అంతే. అందుకే అసలు అలాంటి పిచ్చి ఊహలను రానివ్వను`` అని అన్నారు అనన్య.