English | Telugu

లండన్ లో తెలంగాణ కుర్రాడు అనిల్ జీల.. జాగ్రత్తలు చెప్తున్న నెటిజన్లు!

అనిల్ జీల.. హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబేర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన  'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు. 

Karthika Deepam2 : నా కొడుకుని బయటకు తీసుకురాకపోతే మీ పరువుతీస్తాను! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -52 లో.....పారిజాతం ప్లాన్ చేసి మరి బంటుని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. నా తలపై దొంగ కొట్టబోతుంటే అప్పుడే బంటు నన్ను కాపాడి తన తలకి గాయం చేసుకున్నాడు. ఇక వీడు ఈ ఇంట్లోనే ఉంటాడని పారిజాతం అనగానే వద్దని శివన్నారాయణ అంటాడు. ఎందుకు వద్దు దీప సుమిత్రని కాపాడిందని ఇంట్లో పెట్టుకున్నారు కదా తను ఉంది కాబట్టి వీడు ఉంటాడు.. లేదంటే దీపని పంపించండి అని పారిజాతం అంటుంది. నువ్వు వెళ్లి రేపు ప్రొద్దున రా అని బంటుతో పారిజాతం అంటుంది. ఆ తర్వాత బంటుని అత్తయ్య ఇంట్లోకి తీసుకొని వచ్చిందంటే.. దీపని ఇంట్లో నుండి పంపించడానికే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్త గా ఉండాలని సుమిత్ర అనుకుంటుంది.

మయూరి, సప్తపది, మిధునం మూవీస్ మిస్ అయ్యాను

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఫుల్ ఫన్నీగా సాగింది. ఈ షోకి సీనియర్ నటీనటులు కూడా వచ్చారు. అన్నపూర్ణ, జయలలిత, బాబుమోహన్, శ్రీలక్ష్మి, శివ పార్వతి వచ్చారు. ఇక జయలలితని హోస్ట్ శ్రీముఖి కొన్ని ప్రశ్నలు వేసింది. "ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా..అయ్యో ఈ మూవీ నేను చేయాల్సింది కదా..మిస్ అయ్యిందే అనే లాంటిది ఏదైనా ఉందా" అని అడిగింది. "మయూరి, సప్తపది నేను చేయాల్సిన మూవీస్ అవి మిస్ అయ్యాయి. తర్వాత భరణి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ మిధునం. నేను భరణి గారు చేద్దామని అనుకున్నాం. కానీ అది ఎలాగెలాగో డైవర్ట్ ఐపోయింది.

సదా కోసం వచ్చిన సాగర్...ఆ సాంగ్ స్పెషల్ గా ఆయన కోసమే

నీతోనే డాన్స్ ఈ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో అద్దిరిపోయే ట్విస్టులు ఉన్నాయి. సీజన్ 1 కంటెస్టెంట్స్ అంతా వచ్చేసరికి స్టేజి కళకళలాడిపోయింది. ఇక స్పెషల్ పర్సన్ వచ్చేసరికి సదా ఫేస్ ఇంకా కళకళలాడిపోయింది. వీళ్లందరినీ చూసేసరికి నీతోనే డాన్స్ 3 . 0  అని అంది శ్రీముఖి. ఆట సందీప్, యాని మాష్టర్, నటరాజ్, మెహబూబ్, అంజలి  తో పాటు అసలు సిసలైన సదా మనసు దోచుకున్న సాగర్ వచ్చాడు. ఆ సీజన్ లో సాగర్ అంటే చాలు సదా మనసు ఒక పాటేసుకునేది. ఈ సీజన్ లో బ్రిట్టోని చూస్తే అలా పాటేసుకుంటున్న సదా సాగర్ ని చూసేసరికి ఎగురుకుంటూ స్టేజి మీదకు వెళ్లి డాన్స్ చేసింది.

Krishna Mukunda Murari : తను అబార్షన్ చేయించుకోలేదని తెలుసుకున్న కృష్ణ, మురారి.. విషయం తెలిసుకున్న మీరా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో.. మీరా గదిలోకి కృష్ణ వెళ్లి చెక్‌ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాను ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని వాడిన ట్యాబ్లెట్స్, పేపర్ కనిపిస్తుంది. ప్రిస్కిప్షన్ చూసి కృష్ణ షాక్‌ అవుతుంది. బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా అబార్షన్‌ చేయించుకోలేదు. ఎందుకిలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా.. అబద్ధం చెప్పినందుకు బాధపడాలా అని కృష్ణ అనుకుంటుంది. వాటిని తీసుకుని తన గదికి వచ్చి మనం మోసపోయామని మురారికి చెప్తుంది.