Vegetable Vada

 

 
 
వెజిటబుల్ వడ
 
 
 
 
కావలిసినవి:
బియ్యం పిండి: పావు కేజీ
శనగ పిండి: పావు కేజీ
క్యారెట్ తురుము: 50గ్రా
పచ్చి బఠానీలు: వంద గ్రాములు
గరం మసాలా: 2 చెంచాలు
కేబేజీ కోరు: 50 గ్రా.
పాలకూర: 2 కట్టలు
వంటనూనె: అరకిలో
ఉప్పు: తగినంత
పచ్చిమిర్చి ముక్కలు: 15
బీన్స్ ముక్కలు: 1 కప్పు
కరివేపాకు: 10 రెమ్మలు
కొత్తిమీర కోరు:అర్ధ కప్పు
 
తయారీ:
ముందుగా కూరగాయలన్నిటిని తరిగి ఉదికిన్చుకుని పక్కన పెట్టుకోవాలి.పాలకూరను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పాలకూర, శనగపిండి, గరంమసాలా పౌడర్, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు , ఉడికించిన వెజిటబుల్ ముక్కలు వేసి బాగా కలిపి,కొద్దిగా నీటిని పోసి పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి తరువాత స్టవ్ పై బాణలిపెట్టి అందులో  నూనె పోసి కాగిన తర్వాత పిండి ముద్దలు తీసుకుని వడల్ల చేసుకుని నూనెలో వేయించి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి ప్లేట్ లోకి  తీసుకుని చట్నీ లేక సాస్ తో అయినా సర్వ్ చేసుకోవాలి