Masala Garelu

 

 

 

మసాలా గారెలు

 

 

 

 

కావలసినవి:
మినప పప్పు - అరకేజీ
పచ్చిమిర్చి- 4
అల్లం - కొద్దిగా
కొత్తమీర - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
మిరియాలు- ఒక స్పూన్
వంటసోడ : చిటికెడు
ఉల్లిపాయలు - 4
ఉప్పు- సరిపడ
జీలకర్ర - ఒక స్పూన్
నూనె - తగినంత

 

తయారీ:
ముందుగా మినపప్పును నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి గారెల కోసం కొంచెం గట్టిగా  రుబ్బాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు , జీలకర్ర, మిరియాలపొడి, ఉల్లి తరుగు,ఉప్పు అన్నింటిని కలిపి గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని గారెల పిండిలో వేసి  కలపాలి. ఇప్పుడు స్టవ్ పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి నూనె  వేసి కాగానివ్వాలి. పిండిలో వంటసోడా కలిపి,  పిండి ముద్దని తీసుకుని కావలసిన సైజులో గారెల్ని కాగుతున్న నూనెలో వెయ్యాలి. బంగారువర్ణంలోకి రాగానే  ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి...