Vegetable mixed Curry

 

 

 

 వెజిటేబుల్ మిక్సడ్ కర్రీ

 

 

 

కావలసినవి :
క్యాలీప్లవర్ : 1 చిన్నది
బఠాణి : అర కప్పు
అల్లం,వెల్లులి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
కారం : ఒకటిన్నర స్పూన్
కొత్తీమీర :ఒక  కట్ట
పచ్చి మిర్చి: 4
పసుపు : చిటికెడు
వేయించి గ్రైండ్ చేసుకున్నఉల్లి పేస్ట్ : 2  స్పూన్లు
టొమాటో పెరుగు కలిపి  చేసుకున్న పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- 1 టీ స్పూన్
ఆలూ: 3
టొమాటో : 2
ఉల్లిపాయ  : 2
బీన్స్ ముక్కల : 1 కప్పు
దాలిచిన చెక్క : అంగుళం ముక్క
లవంగాలు- 3
యాలకులు : 4
జీడిపప్పు పేస్ట్ : 2  స్పూన్లు
నూనె : తగినంత
థనియాలపొడి : ఒక స్పూన్
గరం మసాలాపొడి  : ఒకస్పూన్
ఉప్పు : తగినంత

 

తయారీ :
ముందుగా కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించాలి. తరువాత  స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి  నూనె వేసి  వేడయ్యాక జీలకర్ర,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి, మసాలా దినుసులు,పసుపు, వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.అల్లం వెల్లులి,కారం,ధనియాలపొడి,ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు టామాటో ముక్కలని వేసి కొంచం సేపు  వేయించి ఉడికించు కున్నకూరగాయముక్కల్ని వేసి కలిపి మూతపెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత టామాటొ పేస్ట్ ,ఉల్లి,జీడిపపు పేస్ట్,పెరుగు వేసి కలిపి మూతపెట్టి మగ్గిన తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించి చివరగా గరం మసాలా పొడి వేసి సర్వింగ్  బౌల్ లోకి తీసుకుని  కొత్తిమీర వేసి వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి.