Ulli Vadiyalu

 

 

 

 

 

ఉల్లి వడియాలు

 

 

కావలసిన పదార్థాలు:

మినప్పప్పు                                       - అరకిలో
ఉల్లిపాయలు                                      - అరకిలో
కారం                                                 - పావుకప్పు
వాము                                               - రెండు చెంచాలు
పసుపు                                              - చిటికెడు
ఉప్పు                                                 - తగినంత
నూనె                                                 - నాలుగు చెంచాలు

తయారీ విధానం:

మినప్పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టాలి. తొక్క ఉన్న పప్పయితే తొక్క తీసేయాలి. ఉల్లిపాయల్ని తొక్క తీసేసి శుభ్రంగా కడగాలి. ముందుగా మినప్పప్పుని మిక్సీలో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. మరీ జారుడుగా అవ్వకుండా జాగ్రత్తపడాలి. తరువాత ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని ఓ బౌల్ లోకి తీసుకుని... కారం, ఉప్పు, పసుపు, నూనె, వాము వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ పిండిని వడియాల్లాగా వేసుకుని ఎండబెట్టాలి. ఉల్లిపాయ వేశాం కాబట్టి నిల్వ ఉండవేమో అని భయపడాల్సిన పని లేదు. మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి దాచిపెడితే ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి.

- Sameera