ఆనియన్ స్ప్రింగ్ రోల్స్
ఆనియన్ స్ప్రింగ్ రోల్స్
కావాల్సిన పదార్థాలు:
మైదా పింది - 1 కప్పు
ఉప్పు -తగినంత
నీళ్లు - ఒకటిన్నర కప్పు
నూనె - డీప్ ఫ్రైకి కావాల్సినంత
స్టఫింగ్ కోసం పదార్ధాలు:
ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు చిన్నగా తరిగినవి
లావు అటుకులు - అర కప్పు
కొత్తిమీర - 2టేబుల్ సూన్
పచ్చిమిర్చి -2 సన్నగా చిన్నగా తరిగినవి
కారం - అర టీస్పూన్
ఉప్పు - తగినంత
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
నిమ్మరసం - అర చెక్క
తయారీ విధానం:
-ఒక జార్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, టేబుల్ స్పూన్ నూనె, నీళ్లు పోసి అంతా కలిసేలా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి బాగా నలపాలి. తర్వాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీదపెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పిండిని ఒక గంటె మోతాదులో వేసి కడాయి అంతా స్పెడ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఉన్న పిండిని మరలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కడాయి నుంచి పిండి షీట్ వేరయ్యే వరకు సన్నని మంటపై వేడి చేయాలి.
షీట్ ను నెమ్మదిగా తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలా అన్ని షీట్స్ తయారు చేసిన తర్వాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో షీట్ తీసుకుని దానిపై చివరన ఉల్లిపాయ స్టఫింగ్ ను ఉంచాలి. తర్వాత ముందుగా ఒక్క చుట్ట రోల్ చేసి ఆ తర్వాత అంచులను మధ్యలోకి మడవాలి. తర్వాత మైదాపిండి పేస్టును రాసి రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసి..కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్ాయక రోల్స్ ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే సింపుల్ ఎంతో రుచిగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ రెడీ.