స్వీట్ కార్న్ పకోడా!
స్వీట్ కార్న్ పకోడా!
కావలసిన పదార్థాలు...
స్వీట్ కార్న్ - 1 కప్పు (ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి)
ఉల్లిపాయ - పెద్దది 1
శనగ పిండి - అర కప్పు
మిరపకాయలు - 2నుంచి 3
బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
పసుపు - కొద్దిగా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
జీలకర్ర పొడి - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
స్వీట్ కార్న్ పకోడా తయారు చేసే ముందు...ఒక గిన్నెలో ముతకగా రుబ్బిన మొక్కజొన్న వేసి, ఆపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. గ్యాస్ మీద పాన్ లో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వేడి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు రుచికరమైన స్వీట్ కార్న్ పకోడా రెడీ. టమెటా కచప్ తో తింటే రుచి అద్బుతంగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ గా పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.