Tomato Pickle
టమాటా పచ్చడి
కావలసినవి :
టమోటాలు - 1 కేజీ
చింతపండు - 150 గ్రాములు
కారం - 125గ్రాములు
ఆవాలు - 1 స్పూన్
ఉప్పు - పావు కేజీ
అల్లంవెల్లుల్లి పేస్ట్ - పావు కేజీ
నూనె - పావు కేజీ
మెంతిపొడి - 25 గ్రాములు
జీలకర్ర - 2 స్పూన్లు
ఇంగువ - చిటికెడు
జీలకర్ర పొడి - 50 గ్రాములు
తయారీ :
ముందుగా టమాటాలు కడిగి తుడుచి ముక్కలు కోసి నానపెట్టుకున్న చింతపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి.
గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి అందులో ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేయించి చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసిపెట్టుకున్న టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.