Tomato Pandu Mirchi Pachadi
టమాట పండుమిర్చి నిలవ పచ్చడి
టమాటాల సీసన్ మహా జోరుగా సాగుతోంది. టమాటాతో ఎన్ని రకాలు చెయ్యచ్చో అన్నీ ట్రై చేసినా ఇంకా ఏదైనా వెరైటి మిగిలిపోయిందో ఏమో అని ఒక సందేహం. అందుకే కాస్త వెరైటిగా ఉండే ఈ పచ్చడి చేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
టమాటాలు - 1 కేజీ
పండుమిర్చి - 1/2 కేజీ
చింతపండు - 1/4 కేజీ
ఉప్పు - 1 పావు
పసుపు - తగినంత
కారం - 1 పావు
మెంతిపొడి - 5 స్పూన్స్
తయారి విధానం:
ఈ పచ్చడి పెట్టాలనుకునే వారు కాస్త పెద్దగా ఉండే టమాటాలని ఏరి తెచ్చుకోవాలి. అవి కాస్త దోరగా ఉంటె మరీ మంచిది. పండుమిర్చి,టమాటాలను ముక్కలుగా తరుగుకుని పెట్టుకోవాలి. అలా తరిగిన ముక్కల్లో పసుపు ఉప్పు,చింతపండు వేసి 3 రోజులు మూట పెట్టి ఉంచాలి.మూడో రోజు ఆ మిశ్రమాన్ని ఒక బేసిన్లోకి తీసి ఎండలో పెట్టాలి. అలా రెండు రోజులు ఎండిన మిశ్రమాన్ని మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఆ రుబ్బిన ముద్దలో ఎర్రగా వేయించి, మిక్సి పట్టిన మెంతి పొడిని కలపాలి. అందులో కరం కలుపుకుని పోపు వేసుకుంటే చాలు ఘుమఘుమలాడే పచ్చడి మన ముందు ఉంటుంది.
...కళ్యాణి