Tomato egg rice recipe
టమోటా ఎగ్ రైస్ రెసిపి
కావలిసినవి:
బియ్యం అర కేజీ
ఆవాలు ఒక స్పూను
జీడిపప్పు అర కప్పు
జీలకర్ర ఒక స్పూను
పచ్చిమిర్చి 5
నూనె సరిపడా
నెయ్యి 50 గ్రాములు
గరం మసాలా ఒక స్పూను
టమోటా పావు కేజీ
కొత్తిమీరా ఒక కట్ట
గుడ్లు 3
ఉప్పు తగినంత
కారం ఒక స్పూను
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యాన్ని కడిగి ఒక పది నిముషాలు నానపెట్టుకోవాలి .స్టవ్ వెలిగించుకుని గిన్నెపెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వెయ్యాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటమాటో ముక్కలు వేసుకోవాలి.ఇప్పుడు అందులో గుడ్లు చితకొట్టి వేసుకోవాలి కొంచం సేపు వేగాక ఉప్పు, కారం వెయ్యాలి.చివరిలో గరం మసాలా వేసుకోవాలి.ఇప్పుడు కర్రీ లా అయ్యాక నానపెట్టుకున్న బియ్యం వేసుకుని సరిపడా నీళ్ళు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి.పూర్తిగా రెడీ అయిన తరువాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, కొత్తిమిర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి...