లెమన్ ఫ్రైడ్ రైస్
లెమన్ ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్దములు:
బియ్యం -1 గ్లాస్
నూనె -2 స్పూన్స్
కరివేపాకు - 2 రెబ్బలు
పచ్చిమిర్చి - రెండు
అల్లం తరుగు - 1 స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్ - ఒకటి
టొమాటో - ఒకటి
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - హాఫ్ స్పూన్
నిమ్మరసం -3 స్పూన్స్
కొత్తిమీర - సరిపడా
తయారీ విధానం :
బియ్యాన్ని కడిగి అన్నం వండి పెట్టుకోవాలి . స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి తాళింపుదినుసులు వేసి వేయించుకోవాలి . ఇందులో ఉల్లిపాయ , క్యారెట్ ,టొమాటో ముక్కలు ,పచ్చిమిర్చి తరుగు , కరివేపాకు వేసి వేయించాలి . అన్నిటినీ వేయించిన తరువాత అన్నం, కొత్తిమీర తరుగు వేసి కలిపి, దింపే ముందు నిమ్మరసం కలపాలి.