Drumstick Tomato Curry

 

 

 

టమాట - ములక్కాడ ఇగురు 

 

 

 

కావలసినవి: 

ములక్కాడలు         - 6 

టమోటాలు             - పావుకిలో 

ఉల్లిపాయలు            - 4 

పచ్చిమిర్చి               - 8

పసుపు                   - తగినంత 

ఉప్పు, కారం, నూనె     - తగినంత

 

తయారుచేసే విధానం:

టమోటాల, ములక్కాడలు కడిగి ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా చీలికలుగా తరగాలి. గిన్నె పెట్టి నూనె పోసి కాగాక తాలింపు వేసి  వేగాక, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తరువాత ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలియ త్రిప్పి ములక్కాయ  ఉడకడానికి నీళ్ళు పోసి మూత పెట్టాలి, ముక్క ఉడికి నీరు ఇగిరాక దించేసుకోవాలి.