Tomato Batani
టమాటా - బఠాణీ
కావలసినవి :
టమోటాలు - పావుకిలో
పచ్చిబఠాణీలు - 100 గ్రా "
నూనె - పెద్ద గరిటెడు
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 10
వెల్లుల్లి - 4 రెబ్బలు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - 2 చిన్నకట్టలు
ఉప్పు, కారం - తగినంత
తయారుచేసే విధానం :
పచ్చి బఠాణీలను రాత్రి నానబెట్టి కూర వండే ముందు ఉడకబెట్టి వార్చుకోవాలి. టమోటాలు ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలిగా తరగాలి. గిన్నెలో నూనెవేసి కాగాక వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపాలి. తరువాత టమోటా ముక్కలు బఠాణీలు వేసి ఒక్కసారి కల త్రిప్పి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మరోసారి కల త్రిప్పి మూత పెట్టాలి. టమోటా ఉడికాక కొత్తిమీర తరిగివేసి రెండు నిముషాలు ఉంచి దించాలి.