Tasty Oats Paratha

 

 

 

టేస్టీ ఓట్స్ పరోటా

 

 

 

 

కావలసిన పదార్థాలు
ఓట్స్ పౌడర్: రెండు కప్పులు
గోధుమ పిండి: రెండు కప్పులు
కొత్తమీర తరుగు: 3 స్పూన్స్
నువ్వులు: నాలుగు స్పూన్స్
పచ్చిమిర్చి: 8
ఉప్పు:  తగినంత
నూనే: సరిపడా

 

తయారు చేయు విధానం:
 ముందుగా ఓట్స్ ను పొడి చేసి పెట్టుకోవాలి.తర్వాత పచ్చిమిర్చి,కొత్తమీర సన్నగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు  ఒక గిన్నె తీసుకుని అందులో గోదుమపిండీ, ఓట్స్ పౌడర్, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు,  ఉప్పు  వేసి  సరిపడా నీళ్ళు  పోసి చపాతీ పిండిలాగా కలుపుకుని కొద్దిసేపు నానపెట్టాలి. ఇప్పుడు  పిండిని ఉండలుగా తీసుకుని పరోటాలు చేసుకోవాలి. ( ఎక్కువ పొరలు రావాలంటే ఒకసారి చేసుకున్న పరోటాను చాక్ తీసుకుని మధ్యలో గాట్లు పెట్టి మళ్ళీ పరోటాను మడిచి ఇంకోసారీ పరోటా చేసుకోవాలి ఇలా చేస్తే పొరలు ఎక్కువ వస్తాయి) ఇప్పుడు  పెనం పెట్టి  పరోటాని కొంచం ఆయిల్ వేసి  రెండు వైపుల కాల్చి సర్వింగ్ ప్లేట్  తీసుకోవాలి.