Special Samosa Recipe

 

 

స్పెషల్  సమోస రెసిపి

  

 

 

కావలసిన పదార్థాలు


పెసర పప్పు : ఒక కప్పు
నెయ్యి : స్పూన్‌
కొత్తిమీర తరుగు : కొద్దిగా
నూనె :  తగినంత
ఉప్పు : తగినంత
జీలకర్ర : ఒక స్పూన్‌
పచ్చి మిర్చిలు : ఆరు
బంగాళా దుంపలు : రెండు ( పెద్దవి)
చింత పండు గుజ్జు : ఒక స్పూన్
అల్లం పేస్ట్‌ : ఒక స్పూన్‌
పసుపు : ఒక చిటికెడు
ఛాట్‌ మసాలా : అర స్పూన్‌
మైదా : రెండు కప్పులు

 

తయారు చేయు విధానం


ముందుగా   పెసరపప్పు, బంగాళా దుంపలు విడి విడిగా  ఉడికించుకుని అందులో పచ్చి మిర్చి, ఛాట్‌ మసాలా, నీళ్ళలో కలిపిన చింత పండు గుజ్జు, అల్లం పేస్ట్, పసుపు, కొత్తిమీర తరుగు వేసికొద్దిసేపు స్టవ్ మీద ఉడికించుకుని కర్రీలా రెడీ చేసిపెట్టుకోవాలి.తరువాత మైదా లో సాల్ట్ వేసి  పూరి పిండిలా కలుపుకుని   ఒక పది  నిముషాల ముందు నానపెట్టుకుని వుంచుకోవాలి.ఇప్పుడు చిన్న ఉండలుగా తీసుకుని వాటిని  పూరీలా  చేసుకుని  దానిని మద్యలోకి  కట్‌ చేసి  ట్రయాంగిల్‌ షేప్‌లో చుట్టుకుని  కర్రీ ని  మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసి బాగా కాగాక సమోసాలు ఒక్కొక్కటిగా  వేసి  బ్రౌన్ కలర్ వచ్చేవరకు  వేయించి సర్వింగ్  ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి... స్పెషల్ సమోసా రెడీ...