Spicy chicken recipe
స్పైసీ చికెన్ రెసిపి
కావలసినవి :
చికెన్ : అరకేజి
పెరుగు : 3 టేబుల్ స్పూన్స్
నల్ల మిరియాల పొడి : 1 స్పూన్
టమోట : 1
సోంపు పౌడర్ : 1 స్పూన్
ఉల్లిపాయలు : 2
అల్లం, వెల్లుల్లి పెస్ట్ : 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి : 1 టేబుల్ స్పూన్
చికెన్ మసాల : 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాయలు : 3
కరివేపాకు: 4 రెమ్మలు
కొతిమీర : 1 కట్ట కారం : 1 టీ స్పూన్
పసుపు : కొద్దిగ
సాల్ట్ : సరిపడా
నూని : తగినంత
జీడిపప్పు : పది గ్రాములు
తయారు చేయు విధానం :
ముందుగా చికెన్ ను శుభ్రం చేసి కడిగి కారం, పసుపు, పెరుగు, ఉప్పు పట్టించి పక్కన పెట్టాలి.జీడిపప్పు పేస్ట్ చేసి అది కూడా చికెన్ లో కలిపి నానబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్,సోంపు వేసి వేయించాలి.
ఇప్పడు కట్ చేసిన టమోటా ముక్కల్ని వేసి అయిదు నిమిషాలు వేయించాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి కొంచం చిక్కగా అయ్యాక చికెన్ మసాలా వేసి చివరిలో కొత్తిమిరతో వేసుకోవాలి .