చికెన్ సుక్కా

 

 

చికెన్ సుక్కా

 

 కావాల్సిన పదార్థాలు:

చికెన్ - 500 గ్రాములు

ఉల్లిపాయలు - 2 మీడియం సైజు

వెల్లుల్లి - 4 రెబ్బలు

కరివేపాకు - ఒక రెమ్మ

కొబ్బరి - పావు కప్పు తురిమినది

ఉప్పు- రుచికి సరిపడా

ఎండు మిరపకాయలు - 6

ధనియాలు - 1 1/2 టేబుల్ స్పూన్లు

కారం- సరిపడా

మెంతులు- పావు టీ స్పూన్

జీలకర్ర - పావు టీస్పూన్

పసుపు - తగినంత

చింతపండు - సరిపడా

తయారీ విధానం:

చికెన్ శుభ్రంగా కడిగి...చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణాలిలో అన్ని మసాలా దినుసులు వేయించాలి. ఎండు మిరపకాయలను కూడా వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి. అందులో కొంచెం పసుపు వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న మసాలా దినుసులతోపాటు చింతపండు, కాస్తంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ ఆన్ చేసి బాణాలి పెట్టి అది వేడేక్కిన తర్వాత నూనె పోయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. నీళ్లన్నీ ఇంకిపోయిన తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని వేసి సన్నని మంటమీద ఉడకినివ్వాలి. చికెన్ ఉడికిన తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర వేయాలి. అంతే సింపుల్ రుచికరమైన చికెన్ సుక్కా రెడీ.