గోంగూర ఎండు రొయ్యలు
గోంగూర ఎండు రొయ్యలు
కావాల్సిన పదార్థాలు:
ఎండు రొయ్యలు - 200గ్రాములు
నీళ్లు - అరలీటర్
నూనె - అర కప్పు
ఆవాలు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఎర్ర గోంగూర ఆకులు - 2 కట్టలు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
తయారీ విధానం:
ముందుగా ఎండు రొయ్యలను తల, తోక తీసి..శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి అందులో రొయ్యలు వేసి పొంగు వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటిని చల్ల నీటిలో వేయాలి. బాగా కడుక్కోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి.
తర్వాత రొయ్యలు వేసి వేయించుకోవాలి. వీటిని 12 నుంచి 15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తర్వాత గోంగూర ఆకులు వేసుకుని కలపాలి. గోంగూర ఆకులు పూర్తిగా దగ్గరపడేంత వరకు మగ్గించుకోవాలి.తర్వాత రొయ్యలు వేసి వేయించుకోవాలి. వీటిని 12 నుంచి 15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. తర్వాత గోంగూర ఆకులు వేసుకుని కలపాలి. గోంగూర ఆకులు పూర్తిగా దగ్గరపడేంత వరకు మగ్గించుకోవాలి.రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తర్వాత గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అవుతుంది.