సొరకాయ వడలు!

 

 

సొరకాయ వడలు!

సాయంకాలం వేళ మీ పిల్లలకు పెద్దలకు ఏదైనా టేస్టీ స్నాక్ చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇక ఏ మాత్రం ఆలోచించకండి. ఇంట్లో ఒక సొరకాయ ఉంటే చాలు.. దాంతో మీరు ఎంచక్కా వడలు వేసి పెట్టవచ్చు. ఇది వెరైటీగాను రుచికరంగానూ చాలా బాగుంటాయి. సొరకాయ వడలు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం...

కావాల్సిన పదార్థాలు:

సొరకాయ తురుము - రెండు కప్పులు

బియ్యం పిండి - ఒక కప్పు

శెనగపిండి - అర కప్పు

జీలకర్ర -అర టీ స్పూను

ఉల్లిపాయ తరుగు - అరకప్పు

అల్లం తరుగు - ఒక టీస్పూన్

ఉప్పు- రుచికి తగినంత

పచ్చిమిరపకాయల తరుగు రుచికి సరిపడా

తయారీ విధానం:

ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం పిండి, శనగపిండి అలాగే జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే ఇందులో రెండు కప్పుల సొరకాయ తురుము కూడా వేసుకోవాలి.వీటిలో కొద్దిగా నీరు పోసి పిండి కాస్త మందం అయ్యేలా చూసుకోని కలుపుకోవాలి.వడలు వేసే పిండి మాదిరిగా జారుడుగా ఉండాలి.పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని మరీ లూజుగా కలుపుకోకూడదు. సొరకాయ వడలు వేసే ముందు బాణలిలో నూనె పోసి కాచాలి. నూనె వేడి అయ్యాక సొరకాయ వడలు వేసి బంగారు వర్ణం వచ్చేవరకు వడలను కాల్చుకోవాలి. అయితే విటిని ఎక్కువగా మాడ్చకూడదు.అంతె రుచికరమైన సొరకాయ వడలు రెడి. వీటిని కొబ్బరి చట్నీ తో కానీ టమాటో చట్నీ తో కానీ లేకుంటే టమాటా కెచప్ తో కానీ సర్వ్ చేయవచ్చు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ గా తింటే చాలా బాగుంటుంది. శనగపిండి అవసరం లేదు అనుకున్న వారు కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు. అప్పుడు పిండి కాస్త జారుడుగా ఉంటుంది.