Read more!

మష్రూమ్ మంచూరియా!

 

మష్రూమ్ మంచూరియన్!

పుట్టగొడుగులను ఇష్టపడే ఎవరికైనా మష్రూమ్ మంచూరియన్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు సర్వ్ చేయడానికి ఇది సరైనది. ఇంట్లో మష్రూమ్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

మొక్కజొన్న పిండి -4 టేబుల్ స్పూన్లు

మైదా పిండి -2 టేబుల్ స్పూన్స్

తాజా పుట్టగొడుగులు -250 గ్రాములు

వెల్లుల్లి పేస్ట్ -1/2 స్పూన్

అల్లం పేస్ట్ -1/2 స్పూన్

సోయా సాస్ -1/2 స్పూన్

నూనె- వేయించడానికి సరిపడా

ఉప్పు- రుచికి సరిపడా

నీరు- 4 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి- 1 సన్నగా తరిగినవి

ఉల్లిపాయ -1 సన్నముక్కలు కట్ చేసుకోవాలి.

ఉల్లిపొరక- 1 టేబుల్ స్పూన్

చిల్లీ సాస్- 1/2 టేబుల్ స్పూన్

టమోటా కెచప్ -2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్నపిండి, అల్లం, వెల్లుల్లి పేస్టు, సోయాసాస్, ఉప్పు వేసి నీరు పోస్తూ కలపాలి. మీడియం మందపాటి పిండిని తయారు చేసి అందులో పుట్టగొడుగులు వేయాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడయ్యాక అందులో ఈ పుట్టగొడుగులను వేసి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.

ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనెను వెడల్పుగా ఉన్న పాన్ లో వేసి సన్నని మంటమీద వేడి చేయండి. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయగనివ్వండి. అందులో సోయాసాస్, టొమాటో కెచప్, చిల్లా సాస్, ఉఫ్పు వేసిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్టగొడుగులు వేయండి. రెండు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే సింపుల్ మష్రూమ్ మంచూరియన్ రెడీ.