రవ్వ అప్పాలు

 

 

రవ్వ అప్పాలు

 

కావాల్సిన పదార్థాలు:

 బొంబాయి రవ్వ- 1 కప్పు

చక్కెర -3/4 కప్పు

యాలకులు -3

నెయ్యి-5 టేబుల్ స్పూన్లు

నూనె-సరిపడంత

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోయాలి. వాటిని మరిగించాలి. మరుగుతున్నప్పుడు నెయ్యి వేసి రెండు నిమిషాలు తర్వాత రవ్వ వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి. సన్నని మంటమీద ఐదు నిమిషాలపాటు మూతపెట్టి దించేయాలి. చల్లారనిచ్చి అందులో చక్కెర, యాలకులపొడి, వేసి కలపాలి. దీన్ని మళ్లీ స్టౌ మీద పెట్టాలి. సన్నని మంటమీద రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. కలుపుతున్నప్పుడు తప్పా మిగతా సమయాల్లో మూతపెట్టి ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేశారు. చేతికి నెయ్యి రాసుకుని వీటిని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి అందులో అప్పాలను వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించాలి.