గోధుమ రవ్వతో హల్వా
గోధుమ రవ్వతో హల్వా
కావాల్సిన పదార్థాలు :
గోధుమ రవ్వ -1 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పొడి బెల్లం -1 కప్పు
కొబ్బరి ముక్కలు -12
కుంకుమ పువ్వు - రుచికి సరిపడా
బాదం- 3 లేదా 4
జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్షలు
తయారు విధానం:
దశ1:
-కుక్కర్ పాట్‌లో నెయ్యి వేసి, వేడి చేయండి. - వేడి అయ్యాక అందులో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన పెట్టండి.
దశ 2:
- మిగిలిన నెయ్యి వేసి, ఆపై గోధుమ రవ్వ వేసి వేయించాలి.
- గోధుమ కడిని బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
దశ 3:
- గోధుమ కడిలో పచ్చి ఏలకులు వేసి నీళ్లు పోసి కుక్కర్ మూత మూయండి.
- రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.
దశ 4:
- ఆవిరి పూర్తిగా పోయిన తర్వా మూత తెరిచి, వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, కొబ్బరి తురుము వేసి కలపాలి. - పదిహేను నిమిషాల పాటు సన్నని మంట మీదు ఉంచండి.
దశ 5:
- పూర్తయిన డెజర్ట్‌ను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయండి. -కావాలనుకుంటే పై నుంచి కొంచెం నెయ్యిని కూడా జోడించుకోవచ్చు.