Rajma Rasmisa
రాజ్మా రస్మిసా
రాజ్మా ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలుసు.దానితో ఎలాంటి రెసిపి చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా. మీ కోసమే ఈ వంటకం ట్రై చేసి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన రాజ్మా - 2 కప్పులు
ఉల్లిపాయలు - 3
టమాటో ప్యూరి - 1 కప్పు
పెరుగు - 1/4 కప్పు
ఆవాలు - 1 స్పూన్
జీలకర్రపొడి - 1/4 స్పూన్
ధనియాలపొడి - 1/4 స్పూన్
కారం ఉప్పు - తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
తయారి విధానం:
రాజ్మాని రాత్రి నానబెట్టి మర్నాడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వెయ్యాలి. అవి చిటపటలాడాకా దానిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కాస్త ఎర్రగా వేగాకా దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత టమాటో ప్యూరి,పచ్చిమిర్చి వేయాలి. ఒక అయిదు నిమిషాల తర్వాత దానిలో జీరాపొడి, ధనియాలపొడి, ఉప్పు, కారం, పెరుగు వేసి కలపాలి. దానిపై మూట పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి అందులో రాజ్మా వేసి 1 కప్పు నీళ్ళు కలిపి 15 నిమిషాలు సన్నని మంటపై దగ్గరకి రానీయాలి. ఇలా తయ్యారయిన రాజ్మా రస్మిసాని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి నోరూరేలాగానే కాదు తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది.
..కళ్యాణి