Rajma paneer curry
పన్నీర్ రాజ్మా కర్రీ
కావలసిన పదార్ధాలు:
రాజ్ మా - 1 కప్పు
పనీర్ - 1 కప్పు
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర- కొద్దిగా
మీగడ - రెండు స్పూన్స్
ఉల్లిపాయ - 1
పసుపు - అర స్పూన్
నూనె - సరిపడా
తాలింపు దినుసులు
పచ్చిమిర్చి - 2
టమాటాలు - 3
అల్లం,వెల్లుల్లి - ఒక టీ స్పూన్
గరంమసాలాపొడి - 1 టీ స్పూన్
ఉప్పు - తగినంత
కారం - సరిపడా
తయారీ :
ముందుగా రాజ్ మాను రెండు గంటల ముందు నానబెట్టి ఉడికించాలి.తరువాత స్టవ్ వెలిగించి రెండు టీస్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి తురుము వేసి వేగనిచ్చి తరువాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి ఇప్పుడు రాజ్ మా వేసి కొద్దిసేపు తరువాత పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. ఇప్పుడు గ్రేవీ చిక్కగా అయ్యాక గరంమసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని చివరిలో మీగడ వేసి కొత్తిమీర చల్లి వేడి వేడి గా సర్వ్ చేసుకోవాలి...