Rajasthani Papad Curry
రాజస్తాని పాపడ్ కర్రీ
ఇది అప్పడాల తో రాజస్తానివాళ్ళు చేసే కుర ,ఇదివరకు రోజుల్లో. అక్కడ. కూరలు దొరికేవి కావుట..ఎడారి ప్రాంతం,నీటి ఎద్దడి పంటలు పండించే వీలు. చాల తక్కువ వుండడం తో పప్పు దినుసులతో అంటే చానా , రజమ . ఆలు సెనగ పిండితో చేసే కూరలు వాళ్ళ సాంప్రదాయ. వంటలుగా ఉండేవి . తరువాత కేనాల్స్ తవ్వకా ఇపుడు కూరలు పండిస్తున్నరట, ఇక్కడ కూడా. ఎండాకాలం కూరలు దొరకనపుడు రొట్టెలకి ఇది బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు..
అప్పడాలు
3 టమోటాలు
నలుగు పచ్చిమిర్చి
అల్లం
జీలకర్ర
నూనె
ఇంగువ
కసురిమెంతి
ఉప్పు
పసుపు
కారం
ధనియాల పొడి
తయారీ విధానం..
ముందుగా 4, 5 అప్పడాలు కాల్చి పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలి పెట్టి రెండు టేబెల్ స్పూన్ల నూనే వేసి జీలకర్ర, ఇంగువ, కసురిమెంతి వేసి వేగాక ,టమోటా రసం వేసి సరిపడా ఉప్పు పసుపు, స్పూన్ ధనియాల పొడి, అరస్పూన్ కారం, వేసి బాగావేయించి అరగ్లాసు నీళ్ళు పోసి మూతపెట్టి మారగనీయాలి.
ఈ లోగ కప్పుడు పెరుగులో కప్పు నీరు పోసి గిలకొట్టి చిక్కటి మజ్జిగ చేయండి .అపుడు కడాయి లో మరిగేనీళ్ళలో కొద్ది కొద్దిగా మజ్జిగ వేస్తూ కలుపుతూ వుండాలి.
తక్కువ మంట మీద మజ్జిగ కలుపుతూ మరిగాక అప్పడాలు ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిముషాలు ఉడికిస్తే అప్పడాలు మజ్జిగ పీల్చుకుంటాయి కొత్తిమీర జల్లి సెమి లిక్విడ్ గా వుండి రొట్టెలకి అప్పడాల వాసనతో కాస్త పుల్లగా, కరంగా బాగుంటుంది.
మజ్జిగ తిప్పుతూ ఉండకపోతే విరిగి పోతుంది. చేసి చుడండి.
...Kameshwari