Pudina Rasam Recipes
పుదీనా రసం
కావలసిన పదార్ధాలు:-
పుదీనా ఆకు - కప్పు
చింతపండు - నిమ్మకాయంత
ఎండుమిర్చి - 3
మిరియాల పొడి - 1 టీ స్పూను
ఉప్పు - తగినంత
వెల్లుల్లి - 4 రేకులు
మెంతులు, ఆవాలు, జీలకర్ర - 1 టీ స్పూను
నూనె - 2 టీ స్పూను
కరివేపాకు - 4 రెబ్బలు
పసుపు - పావు టీ స్పూను
తయారుచేసే విధానం:-
బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రెక్కలతోపాటు మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. తరువాత పుదీనా ఆకుల్ని, కరివేపాకు, పసుపు వేసి వేగించి తగినంత నీరు జతచేయాలి. రసం మరుగుతున్నప్పుడు చింతపండు (ముందే చిన్న కప్పులో నానబెట్టుకొని ఉంచుకోవాలి). మిరియాలపొడి, ఉప్పు వేసి రెండు పొర్లు వచ్చేక దించేయాలి.