Pudina Pachadi

 

ఆంధ్రా స్టైల్ లో పుదీనా పచ్చడి

 

 

ఎండాకాలం పుదీనా ఎంత వాడితే అంత మంచిది. అందుకే మనం రోజూ చేసే ఆహారపదార్థాల్లో పుదీనా కలిసేలా చూసుకోవటం మంచిది. ఇక ఉదయాన్నే చేసే టిఫిన్స్ లో, మధ్యాహ్నం తినే రైస్ ఐటమ్స్ లో చక్కగా ఉపయోగపడే పుదీనా చెట్నీఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

 

కావాల్సిన పదార్థాలు:

పుదీనా ఆకులు - 2 కట్టలు

కొత్తిమీర - 1 కట్ట

చింతపండు గుజ్జు - 2 చెంచాలు

సెనగపప్పు, మినపపప్పు - 1/4 కప్పు

జీలకర్ర - 1 చెంచా

ఎండుమిర్చి - 8,9

వెల్లుల్లి రెబ్బలు - 5

ఉప్పు - తగినంత

 

తయారీ విధానం:

ఈ చెట్నీ తయారి కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 3 చెంచాలు నూనే  వేసి ఎండుమిర్చిని వెయ్యాలి. అవి కాస్త వేగాకా అందులో మినపపప్పు, సెనగ పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగాకా తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో పుదీనాని, కొత్తిమీరని కూడా వెయ్యాలి. అవి వేగాకా స్టవ్ ఆపి, ముందుగా సిద్దం చేసుకున్న ఎండుమిర్చి, సెనగ, మినప మిశ్రమాన్ని మిక్సిలో వేసి అందులోనే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మెత్తగా ఆడాలి. పోపు మిక్సి పట్టాకా అందులో పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసి రుబ్బాలి. అది మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా కాస్త రోటి పచ్చడి లాగా రుబ్బుకుంటే బాగుంటుంది. అంతే పుదీనా పచ్చడి రెడీ అయినట్టే. ఇది టిఫిన్స్ లోకి అలాగే అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.

 - కళ్యాణి