Cauliflower Pickle

 

 

కాలీఫ్లవర్ నిలవ పచ్చడి

 

 

 

 

కాలీఫ్లవర్ చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంటుంది. అలాంటి కాలిఫ్లవర్ తో నిలవ పచ్చడి పెట్టుకుని రోజూ తింటే ఇంకా బాగుంటుంది కదా. మరి అది ఎలా తయారుచెయ్యాలో చూద్దామా.

 

కావాల్సిన పదార్థాలు:

కాలీఫ్లవర్ - ఒకటి

కారం - 4 చెంచాలు

ఉప్పు - 3 చెంచాలు

ఆవపిండి - 4 చెంచాలు

మెంతిపిండి - 1 చెంచా

వెల్లుల్లి  రెబ్బలు - 10

నూనె - తగినంత

 

తయారి విధానం:

దీని తయారి కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి అందులో తరిగిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వెయ్యాలి. మూత పెట్టకుండా కాస్త ఎరుపు రంగు వచ్చేదాకా వేయించి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. ఆ ముక్కలలో కారం, ఉప్పు, మెంతి పిండి, ఆవపిండి, పసుపు వేసి కలుపుకోవాలి. కాస్త పులుపు కావాలనుకుంటే 2 చెంచాల నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా తయారయిన మిశ్రమంలో వెల్లుల్లితో పోపు పెట్టుకుంటే చాలు. ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ నిలవ పచ్చడి రెడీ అయినట్టే.

 

- కళ్యాణి