Pineapple Raita
పైనాపిల్ రైత
కావలిసిన పధార్థాలు:
పెరుగు - 2 కప్పులు
పైన్ఆపిల్ ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 2 స్పూన్స్
జీలకర్ర పొడి - 2 స్పూన్స్
నల్ల మిరియాల పొడి - 1/4 స్పూన్
కొత్తిమీర తరుగు - 2 స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం:
ఒక బౌల్ లో పెరుగుని చిలికి పెట్టుకోండి.
చిలికిన పెరుగులో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలపండి.
ఈ మిశ్రమం లో పైన్ఆపిల్ ముక్కలు కలిపి 10-15 నిముషాలు ఫ్రిడ్జ్ లో పెట్టండి.
దీనిని దానిమ్మ గింజలు, కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.
Tip: తాజాదనాన్ని కాపాడటానికి మీరు పైనాపిల్ రైతాని చల్లగా ఉంచండి.