How to Make Rava Idli
రవ్వ ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
జీడిపప్పు - 20
పచ్చిబఠాని - 1 టేబుల్ స్పూన్స్
అల్లం - కొంచెం
పచ్చిమిర్చి - 3
నూనె - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడ
క్యారెట్ - 1
పెరుగు - 2 కప్స్
పోపు దినుసులు - తగినంత
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 1 కట్ట
తయారీ విధానము:
* బాణలిలో నూనె వేసి కాగాక అందులో ముందుగా జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
* అదే బాణలిలో పోపు దినుసులు వేసి, వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పచ్చిబఠాని కూడా వేసి వేయించాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
* వేరే గిన్నెలో చల్లారిన మిశ్రమాన్ని తీసుకోని దానిలో పెరుగు, ఉప్పు కలపాలి. మిశ్రమం గట్టిగా వుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు.
* ఇందులో తరిగిన క్యారెట్, కొత్తిమీర, జీడిపప్పు కలిపిన తర్వాత మిశ్రమాన్ని దాదాపు 15 నిమిషాలు పాటు పక్కన పెట్టుకోవాలి.
* ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్‌లో వేసి కుక్కర్‌లో వాటర్ పోసి స్టౌవ్ మీద పెట్టాలి అంతే 10 నుంచి 15 నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ రెడీ.
Tip :
1 పెరుగు పుల్లగా వుంటే బాగుంటుంది.
2 మనము కలుపుకున్న ఇడ్లీ మిశ్రమం ఎంత నానితే అంత మెత్తగా ఇడ్లీ వస్తాయి. నానకపోతే ఇడ్లీ గట్టిగా వస్తాయి. ఇలా రాకుండా వుండాలంటే బేకింగ్ షోడాని చిటికెడు కలపండి........
https://www.youtube.com/watch?v=znRSxNsqQHg&t=10s
- Sandhya