పెసరపప్పు దహి వడ!
పెసరపప్పు దహి వడ!
కాలసినవి:
పెసరపప్పు - 2 కప్పులు
నూనె - తగినంత
పెరుగు - 3 కప్పులు
కొత్తిమిర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
జీలకర్ర - 1 స్పూన్
అల్లం - తగినంత
పచ్చిమిర్చి - 4
కారం - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 3
స్వీట్ చట్నీ - 2 స్పూన్స్
జీలకర్ర పొడి - 1 స్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
తయారీ :
మూడు గంటల ముందు పెసరపప్పును నీళ్ళల్లో నానపెట్టాలి. తర్వాత పెసరపప్పు కడిగి నీటిని మొత్తం తీసేసి వడకట్టి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకుని ఈ పిండిని గుండ్రంగా వడల్లా చేసుకుని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన వదలను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని ఉప్పు వేసిన తాలింపు వేసిన పెరుగును పోయాలి. దానిపై జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, కారం వేసి, స్వీట్ చట్నీ వేసి వేయించిన కొత్తిమిరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.