Peanut Rice

 

 

పల్లీల రైస్

కావాల్సిన పదార్ధాలు:

వేరుసెనగపప్పు - పావు కప్పు

నువ్వులు - పావు కప్పు

ఎండు మిర్చి - నాలుగు

పచ్చి కొబ్బరి - పావు కప్పు

రైస్ - ఒక కప్పు

ఉప్పు - తగినంత

నూనె - పావు కప్పు

ఆవాలు - అర టేబుల్ స్పూన్

మినపప్పు - ఒక టేబుల్ స్పూన్

సెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్

కరివేపాకు - రెండు రెబ్బలు

తయారీ విధానం:

* ముందుగా రైస్ వండేసి పక్కన పెట్టుకోవాలి.

* తర్వాత కళాయిలో వేరుసెనగపప్పు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఆ తరువాత ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, నువ్వులు వేసుకుని మంచి సువాసన వచ్చేవరకు వేయించి, చల్లార్చుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి.

* ఇప్పుడు కళాయి లో నూనె వేసి తాలింపు దినుసులు అన్నీ వేసి వేయించుకుని ఉడికించిన అన్నం, సాల్ట్, వేరుసెనగపప్పు పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. *దీనిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది .