రాగి దోశలు!

 

రాగి దోశలు!

కావాల్సిన పదార్థాలు:

రాగిపిండి - 1 కప్పు

రవ్వ - పావు కప్పు

బియ్యం పిండి- 1 టేబుల్ స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

పెరుగు - పావు కప్పు

తయారీ విధానం:

రాగిపిండితో దోశలు తయారు చేసే ముందు ...ఒక గిన్నెలో రాగిపిండిని వేసుకోవాలి.

తర్వాత అందులో రవ్వ, బియ్యంపిండి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

తర్వాత పెరుగు వేసి మిక్స్ చేయాలి. తర్వాత తాగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.

దీనిని దోశ పిండి వలె కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంటపాటు నానబెట్టుకోవాలి.

పిండి చక్కగా నానిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి.

పెనం కొద్దిగా వేడయ్యాక నూనె వేసి తుడుచుకోని..దోశ వేసేటప్పుడు పెనం కొద్దిగా వేడిగా ఉండేలా చూసుకోవాలి.

లేదంటే దోశ పెనంకు అంటుకుపోయి సరిగ్గా రాదు. ఇప్పుడు పిండిని తీసుకుని దోశ వలె గుండ్రంగా వేసుకోవాలి. ఈ దోశ మరీ పలుచగా రాదు.

దోశ తడి ఆరిన తర్వాత నూనె వేసి కాల్చుకోవాలి.

దోశను రెండు వైపులా కాల్చుకుని..ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అవుతుంది.

దీనిని ఏ చట్నీతో తిన్నా రుచి అద్బుతంగా ఉంటుంది.

 

 

Recommended for you