పనీర్ ఫ్రైడ్ రైస్

 

 

పనీర్ ఫ్రైడ్ రైస్

 

కావాల్సిన పదార్ధాలు:

పనీర్ - 200 గ్రా

కారం - రెండు టేబుల్ స్పూన్స్

టమాటో సాస్ - ఒక టీ స్పూన్

నూనె - రెండు టీ స్పూన్స్

ఫ్రైడ్ రైస్ కోసం:

బాస్మతి రైస్ - ఒక కప్పు

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

ఉప్పు - తగినంత

నల్ల మిరియాల పొడి - అర టీ స్పూన్

క్యారెట్ సన్నని తరుగు - పావు కప్పు

బీన్స్ సన్నని తరుగు - పావు కప్పు

లైట్ సోయా సాస్ - ఒక టీ స్పూన్

ఉల్లి కాడల తరుగు - రెండు టేబుల్ స్పూన్స్

తయారీ విధానం:

* ముందుగా రైస్ వండి పక్కన పెట్టుకోవాలి.

* నూనెలో పనీర్ వేసి అందులో కారం, టొమాటో సాస్ వేసి 2 నిమిషాలు టాస్ చేసి పనీర్ పక్కన పెట్టుకోవాలి.

* మరి కొద్దిగా నూనె వేసి అందులో కేరట్, బీన్స్ తరుగు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేపుకోవాలి.

* నిమిషం తరువాత రైస్ తో పాటు మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి ఒక నిమిషం వేపుకోవాలి.

* ఆఖరున ఉల్లికాడల తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.