Peanut Masala Rice

 

 

పల్లీ మసాలా రైస్

కావలసిన పదార్దములు:

బియ్యం -1 గ్లాస్

పల్లీలు - అరకప్పు

తాళింపుదినుసులు - 2 స్పూన్స్

మినపప్పు - 1 స్పూన్

సెనగపప్పు - 1 స్పూన్

జీలకర్ర - హాఫ్ స్పూన్

నువ్వులు - 1 స్పూన్

ఎండుమిర్చి - 3

కొబ్బరిపొడి - 2 స్పూన్స్

నూనె - 3 స్పూన్స్

కరివేపాకు - 2 రెబ్బలు

ఉప్పు - తగినంత

తయారీ విధానం:

ముందుగా గ్లాస్ బియ్యాన్ని రైస్ వండుకోని పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడెక్కాక పావుకప్పు పల్లీలు, మినపప్పు, సెనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేయించుకుని కొబ్బరిపొడి వేసి ఓసారి కలిపి దింపేయాలి. తరువాత ఈ దినుసుల్ని మిక్సీలో వేసుకుని పొడిలా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి.. తాలింపు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక అన్నం, రెడీగా పెట్టుకున్న పొడి, తగినంత ఉప్పు వేసి కలిపితే పల్లీ మసాలా రెడీ. దీనిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.